దసరా సినిమాతో.. నానికి భారీ నష్టం వచ్చిందట తెలుసా?

praveen
నాచురల్ స్టార్ నాని హీరోగా రా అండ్ రస్టికల్ స్టోరీ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా దసరా . తెలంగాణలోని వీర్లపల్లి అనే గ్రామం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా మాస్ ప్రేక్షకులందరికీ కూడా పూనకాలు తెప్పించింది. మొన్నటి వరకు లవర్ బాయ్గా కనిపించిన నానిలో దాగి ఉన్న మాస్ హీరోని ప్రేక్షకులకు పరిచయం అయ్యేలా చేసింది దసరా సినిమా. ఇక ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాచురల్ స్టార్ నాని కెరియర్ లోనే మొదటిసారి 100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా దసరా రికార్డు సృష్టించింది.

 అయితే సినిమా విడుదలైన సమయంలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఇక ప్రమోషన్స్ తో మేకర్ దాన్ని దాటగలిగారు అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు స్టార్ డైరెక్టర్ రేసులోకి వచ్చేసాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాతో అటు నిర్మాతలకు కూడా లాభాలు గట్టిగానే వచ్చాయి.  అయితే దసరా సినిమా ద్వారా మాత్రం నానికి నష్టాలే మిగిలాయట. ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో నాని కొంచెం పట్టు విడుపుగా వ్యవహరించాడు. పూర్తి పారితోషకం  తీసుకుని భారం మొత్తం నిర్మాతపై పెట్టడం ఇష్టం లేక సినిమా శాటిలైట్ రైట్స్ తన రెమ్యూనరేషన్ లో భాగంగా తన దగ్గర పెట్టుకున్నాడట.

 అయితే దసరా సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమాను ఏ ఛానల్ తీసుకునేందుకు ముందుకు రాలేదట. దీంతో ఇక రెమ్యూనరేషన్ కి బదులు శాటిలైట్ రైట్స్ నే పారితోషకంగా తన దగ్గర పెట్టుకున్న నానికి ఇక ఈ సినిమాను ఏ ఛానల్ కొనకపోవడంతో భారీగానే నష్టం వచ్చింది అని అంటూ ఒక టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇంతకు ముందులా పెద్ద సినిమాలని అటు టీవీ ఛానల్స్ భారీ ధర పెట్టి కొనడం లేదు అన్న విషయం తెలిసిందే. థియేటర్లో మిస్ అయిన వారు ఓటీటిలో  డౌన్లోడ్ చేసుకొని తమకు ఇష్టం వచ్చినప్పుడు చూసుకుంటున్నారు. దీంతో టీవీలో మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు  వస్తుంటే చూడడానికి ఎవరు పెద్దగా ఇష్టపడట్లేదు. అందుకే చానల్స్ సైతం పెద్దగా ధర పెట్టేందుకు ముందుకు రావట్లేదు. ఇక అందుకే నానికి కూడా నష్టాలు వచ్చాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: