HBD: బర్తడే రోజున పేరు మార్పు ..విజయ్ దేవరకొండ..!!

Divya
తెలుగు బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య గత కొద్దిరోజుల నుంచి ఒక వార్ జరుగుతోంది. ముఖ్యంగా THE అని వివాదం ఎక్కువగా నడుస్తూ ఉంటోంది. అనసూయ ఏ ముహూర్తాన ఇలాంటి వివాదానికి మొదలుపెట్టిందో కానీ ప్రస్తుతం ఈ విషయం చాలా ట్రెండీగా మారిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ కు అనసూయకు మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయని అప్పటినుంచి విజయ్ పైన ఈమె కుదిరినప్పుడల్లా పలు రకాల పోస్ట్లు ట్విట్టర్లు షేర్ చేస్తూ ఉంటుంది.

గడిచిన రెండు రోజుల క్రితం THE అనే దానిని పాయింట్ అవుట్ చేసి ఒక ట్విట్ చేసింది.. దీంతో పైత్యం అంటూ కొద్దిగా ఘాటుగానే రాసుకొచ్చిన అనసూయ.. ఇలా అన్నది విజయ్ దేవరకొండ అని అభిమానులకు తెలియక అనసూయను ఒక్కసారిగా మళ్లీ ఆంటీ ఆంటీ అంటూ అసభ్యకరమైన పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు.. ఇలాంటి వాటిని కూడా అనసూయ ట్విట్టర్లో షేర్ చేసి ఇలా ఉన్నారు దొంగ.. బంగారు కొండలు అంటూ చూపించింది. కానీ THE వివాదంపై విజయ్ దేవరకొండ అసలు స్పందించలేదు దీన్నే బ్రాండ్ గా సెట్ చేసుకున్నారు.
ఇప్పటివరకు నార్మల్గా ఉన్న విజయ్ దేవరకొండ.. తన పేరు ముందు THE అనే బ్రాండ్ ని చేర్చినట్లుగా తెలుస్తోంది ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడం సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు.. ఇందులో THE అనే పదాన్ని హైలైట్ చేస్తూ చూపించారు. దీంతోపాటు విజయ్ దేవరకొండకు విష్ చేసిన ప్రతి ఒక్కరు కూడా THE నీ విష్ చేస్తూ హైలెట్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ది అనే పదం బ్రాండ్ గా మారిపోయింది. ఇప్పుడు తాజాగా THE అనే పదం గుర్తుకు రాగానే విజయ్ దేవరకొండ పేరు గుర్తుకు వచ్చేలా చేస్తోంది.. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: