అనసూయ, విజయ్ దేవరకొండ ల మధ్య గొడవకు కారణం అదేనా..?

murali krishna
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ,యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ల మధ్య గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న విషయం మనందరికి తెలిసిందే. విజయ్ దేవరకొండ  నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో మొదలైన వీరి గొడవ ఇప్పటికీ  కూడా అలాగే కొనసాగుతూ ఉంది.
అనసూయ కూడా పరోక్షంగా విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లతో విరుచుకు పడుతుంది.అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో  ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటింస్తున్న ఖుషి  సినిమా పోస్టర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అందులో విజయ్ దేవరకొండ పేరు ది విజయ్ దేవరకొండ అని అయితే ఉంది. ఇక ఆ విషయం పై అనసూయ స్పందిస్తూ.. ఇప్పుడే నేను ఒకటి చూశాను. ది నా.. బాబోయ్ మనం ఏం చేస్తాం. పైత్యం అంటకుండా చూసుకుందాం అంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది. దాంతో విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ మధ్య మళ్లీ ట్వీట్స్ యుద్ధం మొదలయ్యింది. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ అలాగే యాంకర్ అనసూయ భర్తకు సంబంధించిన ఒక వార్త హల్ చల్ చేస్తుంది..
అది ఏమిటంటే కొన్ని నెలల క్రితం ఒక సినిమా ఫంక్షన్లో అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ విజయ్ దేవరకొండతో గొడవ పెట్టుకున్నారని సమాచారం.. వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు గా తెలుస్తోంది. తన సినిమా గురించి అనసూయ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విజయ్  దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది.. తన భర్తతో గొడవ పెట్టుకోవటంతో విజయ్ దేవరకొండ మీద అనసూయకు కోపం ఇంకా పెరిగిందని సమాచారం.. అందుకే వీలు పడినప్పుడల్లా విజయ్ ను టార్గెట్ చేసి కామెంట్లు చేస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: