వావ్: న్యూ లుక్ లో అదరగొట్టేస్తున్న ప్రభాస్..!!

Divya
టాలీవుడ్ హీరో ప్రభాస్ సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ సినిమా విడుదల కాక ఏడాది పైన కావస్తోంది. బాహుబలి సినిమా తర్వాత సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు ప్రభాస్. వాస్తవానికి ప్రభాస్ ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్-k , డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు బాలీవుడ్లో మరో రెండు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు కావడం గమనార్హం.
ప్రభాస్ నటించిన సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.. ఆది పురుష్ చిత్రం రేపటి రోజున సినిమా ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.భారతదేశంలోని ముఖ్య నగరాలలో ప్రభాస్ సందడి చేయబోతున్నట్లు ఇప్పటికీ చిత్ర బృందం అన్ని షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ భాగంగా ప్రభాస్ లుక్ బయటకు రావడం జరిగింది.. మొన్నటి వరకు చాలా లావుగా కనిపించిన ప్రభాస్ లుక్ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. ప్రభాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అభిమానులు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.
తెలుపు రంగు చొక్కా చిరిగిన డేనియన్ జీన్స్ వైట్ స్నిక్కర్లు చాలా హాట్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ బాడీలో వచ్చిన చేంజ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆయన నవ్వుతూ ఉండగానే అక్కడ ఉన్న మీడియా వారు ఫోటోలు తీయగా ఈ ఫోటోలు వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు ఈ ఫోటోలు చూసి ఈ లుక్కులో ఫిదా అవుతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.. ప్రభాస్ ఆది పురుష్ ట్రైలర్ ని దాదాపుగా 70 దేశాలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి మరి ఈ సినిమా నైనా ప్రభాస్ కెరియర్ లో ఎలాంటి మలుపు తిప్పుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: