ఆమె వల్లే రష్మిక , విజయ్ దేవరకొండ విడిపోయారా..?

Divya
సినిమా ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయిన ఈయన పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అవతారం ఎత్తి తన క్లాసిక్ లుక్ తో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో అప్పటివరకు టాప్ హీరోలుగా ఉన్న హీరోల అభిమానులు కూడా అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ ను ఓన్ చేసుకున్నారు. ఈ క్రమంలోని ఇప్పటికీ ఆయనకు మంచి క్రేజ్ లభించడమే కాదు అంతకుమించి అవకాశాలు కూడా లభిస్తున్నాయి.
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత గీతా గోవిందం సినిమాతో మరొకసారి సంచలనం సృష్టించాడు విజయ్ దేవరకొండ. ఇందులో నేషనల్ రష్మిక మందనతో ఆయన చేసిన రొమాన్స్ జనాలకు పిచ్చెక్కిస్తుంది.  ముఖ్యంగా వీళ్ళ రొమాన్స్ బాగా పండడమే కాదు నిజంగానే వీరు లవ్ లో ఉన్నారు అంటూ రూమర్స్ కూడా వినిపించాయి.  ఆ తర్వాత చేసిన సినిమాల్లో కూడా అదే హై రేంజ్ పెర్ఫార్మెన్స్ ఉండడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉందని అందరూ ఫిక్స్ అయిపోయారు. కొన్నిసార్లు మీడియా కంట పడడం.. పబ్బులు, పార్టీలు, లేట్ నైట్ డిన్నర్లు అంటూ తిరగడంతో ఇక అందరూ కన్ఫామ్ చేసుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ గత కొంతకాలంగా అటు రష్మిక ఇటు విజయ్ దేవరకొండ ఒకరికొకరు కలుస్తున్నట్లు ఎక్కడ ఆధారాలు లేవు.
అంతేకాదు వీళ్ళిద్దరూ ఒకరికి సంబంధించి మరొకరు ఎటువంటి పోస్ట్లు కూడా పెట్టడం లేదు. దీంతో వీరిద్దరూ విడిపోయారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.  ఇలాంటి సమయంలోనే ఈ జంట విడిపోవడానికి కారణం స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత  అంటూ ఒక వార్త ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంత ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్ చూస్తుంటే సమంత విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేటట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన రష్మికను కాదని సమంతకు మరింత దగ్గరవుతున్నట్లు సమాచారం.. అందుకే ఆయన రష్మిక దూరం పెట్టాడని ఆమె విషయం తెలుసుకొని అతడికే దూరం అయిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: