'ఆదిపురుష్'లో సీత పాత్ర కోసం.. ముందుగా ఆ హీరోయిన్ ను అనుకున్నారట?

praveen
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ గా ఉంది ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా. అదే సమయంలో మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమాగా కూడా ఈ మూవీ కొనసాగుతోంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు అన్న విషయం తెలిసిందే. రామాయణం నేపథ్యంలో ఇక ఈ సినిమా తెరకెక్కింది.

 గతంలో ఈ సినిమా గ్రాఫిక్స్ గురించి ఎన్నో విమర్శలు రాగా.. చిత్రబృందం  వెనక్కి తగ్గి మళ్ళీ గ్రాఫిక్స్ లో మార్పులు చేర్పులు చేసింది. ఇక ఇప్పుడు విడుదలవుతున్న కొత్త అప్డేట్స్ అటు ఫ్యాన్స్ అందరినీ కూడా ఉర్రూతలూగిస్తూ  ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తుండగా అటు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. అయితే సీత పాత్ర కోసం కృత్రి సనన్ సరిగ్గా సరిపోయింది అని చెప్పాలి. ఆమెను కాకుండా మరొక హీరోయిన్ ను తీసుకుని ఉంటే ఆ పాత్రకు అంతలా సెట్ అయ్యేది కాదేమో అని అభిమానులకు కూడా అనుకుంటున్నారు.

 అయితే ఆది పురుష్ సినిమా కోసం సీత పాత్రలో ముందుగా కృతి సనన్ ను అనుకోలేదట డైరెక్టర్ ఓం రౌత్.  మరో హీరోయిన్ తో ఈ పాత్ర కోసం సంప్రదింపులు జరిపాడట. అయితే ఈ పాత్రలో నటించేందుకు ఆ హీరోయిన్ సిద్ధంగా ఉన్నప్పటికీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిందట. దీంతో ఇక ఆ హీరోయిన్ తర్వాత ఈ పాత్ర కోసం ఎవరైతే సరిపోతారని డైరెక్టర్ ఆలోచనలో పడగా ఇక కృతి సనన్ వారికి నెక్స్ట్ ఆప్షన్ గా మారిపోయింది అన్నది తెలుస్తుంది. అయితే ఇలా సీత పాత్ర కోసం చర్చలు జరిపిన మొదటి హీరోయిన్ ఎవరో కాదు ఆలియా భట్ అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: