ఎట్టకేలకు ఓటిటిలోకి రాబోతున్న తోడేలు మూవీ..!!

Divya
ఇటీవల కాలంలో థియేటర్లో విడుదలైన చిత్రాలన్నీ కూడా ఎక్కువగా ఓటీటి లో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలా ఇప్పటివరకు దసరా, బలగం, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి చిత్రాలు కూడా ఓటీటి లోకి విడుదలై బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా సరే నాలుగు వారాలు గడిచిందంటే చాలు ఓటీటి లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. అయితే ఒక్క సినిమా మాత్రం దాదాపుగా సినిమా విడుదలై ఇప్పటికి ఆరు నెలలు కావస్తున్న ఆ సినిమా ఓటీటి లోకి ఎంట్రీ ఇవ్వలేదు.

ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే బాలీవుడ్ నటుడు వరుణ్ దావత్ హీరోగా నటించిన  భేదియా చిత్రం. ఈ చిత్రాన్ని తెలుగులో తోడేలు అనే పేరుతో విడుదల చేయడం జరిగింది.ఇందులో హీరోయిన్గా కృతి సనన్ నటించింది. ఈ సినిమా విడుదల ఇప్పటికి ఆరు నెలల పైనే కావస్తున్న తాజాగా ప్రముఖ ఓటీటి సంస్ధ జియో సినిమాలు ఈనెల 26వ తేదీన విడుదల కాబోతోంది. మరొకవైపు ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతున్నది తోడేలుగా మారిన వ్యక్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు.
మరి ఈ సినిమా సీక్వెల్ ఎలా ఉంటుందో అంటూ బాలీవుడ్ వర్గాలు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి నటీనటులు దర్శకుడు ఎవరని విషయం ఇంకా తెలియాల్సి ఉంది ఈ సినిమా 2025 విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.  కృతి సనన్ కూడా ప్రభాస్ తో కలిసి ఆది పురుష్ చిత్రంలో నటించినది. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతోంది. రేపటి రోజున ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ లో విడుదల కాబోతున్న తోడేలు సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: