నన్ను గే అన్నారు.. ఆ హీరోయిన్ ఆత్మహత్యకు నేను కారణం కాదు - నవదీప్

Divya
జై సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరో నవదీప్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఈయన ఒకప్పుడు చందమామ, గౌతమ్ ఎస్ఎస్సి వంటి సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టినప్పుడు సెకండ్ హీరోగా కూడా నటించాడు. అలా ఆర్య2 సినిమాలో నటించి మెప్పించిన నవదీప్ విలన్ గా కూడా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే నవదీప్ సినిమాల విషయంలో కాదు వ్యక్తిగత విషయంలో కూడా అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండేవారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన తాజాగా న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ తో మే 12వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.
ఆహా లో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది.  ఇకపోతే తాజాగా టీజర్ రిలీజ్ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న నవదీప్ తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన రూమర్స్ గురించి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ 2005లో ఒక హీరోయిన్ ఆత్మహత్య చేసుకుని మరణించినప్పుడు దానికి కారణం నేనే అన్నారు.  కానీ ఆమె మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఒకసారి మా ఇంట్లో రేపు పార్టీ ఇస్తూ ఉండగా నేను పోలీసులకు దొరికిపోయానని వార్తలు కూడా సృష్టించారు. అయితే ఆరోజు రాత్రి నేను మా అమ్మతో కలిసి ఫామ్ హౌస్ లో డిన్నర్ కి వెళ్ళాను. అప్పుడు మా అమ్మ నాతో ఉండడం వల్ల అప్పుడు కూడా తప్పుడు వ్యాఖ్యలు చేశారు.
పత్రికా వాళ్ళు చేసిన తప్పుడు వ్యాఖ్యల వల్ల మా ఇంట్లో వాళ్లే నన్ను అనుమానించే పరిస్థితి వచ్చింది. ఇక నన్ను గే అని కూడా కొంతమంది అన్నారు కానీ నేను గే కాదు అందరిలాగే వ్యక్తిని.. అయితే నేను గే కాదు అని నిరూపించుకునే అవసరం నాకు లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ఎన్నో విషయాలు తెలియజేశారు నవదీప్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: