మనీ: ఈ బ్యాంకులో ఏకంగా 9.6% వడ్డీ.. వారికి పండగే..!

Divya
మన దగ్గర సొమ్ము ఎంత ఉన్నా సరే పొదుపు సూత్రం పాటించాలని నిపుణులు సైతం ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉంటారు.  వాస్తవానికి ఇప్పుడు చేసే పొదుపు భవిష్యత్తులో మన అవసరాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని పెద్దలు లేదా నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఈ విషయం అనుభవం వచ్చేకొద్దీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ముఖ్యంగా డబ్బులు పొదుపు చేసే విషయంలో ఉద్యోగులకు అనుభవం ఉంటుంది. ఎందుకంటే వారు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చిన సొమ్ము వారి భవిష్యత్తు అవసరాలు అంటే ముఖ్యంగా ఆరోగ్య ఆహార అవసరాలను తీర్చే విధంగా పొదుపు చేస్తూ ముందుకు వెళ్తారు.
దీంతో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వంటివి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్ ల పై సాధారణ పౌరుల కంటే ఎక్కువ వడ్డీ రేటు అందిస్తారు. ఇటీవల ఆర్బిఐ తీసుకున్న చర్యల కారణంగా ముఖ్యంగా అన్ని బ్యాంకులు కూడా తమ డిపాజిట్ ల పై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే సీనియర్ సిటిజనులకు ఒక బ్యాంకు వారు ఏకంగా 9.6% వడ్డీని అందిస్తున్నారు. అది ఏదో కాదు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు.. ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెంచింది. అయితే ఈ పెంచిన వడ్డీ రేట్లు మే 5 2023 నుంచి అమలులోకి వచ్చే విధంగా బ్యాంకు ప్రతినిధులు సవరణలు చేసినట్లు తెలిపారు.
ముఖ్యంగా ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు 40 నుంచి 160 బేసిస్ పాయింట్లు పెంచింది  కాబట్టి సవరణ తర్వాత ఎస్ఎస్ఎఫ్బి సాధారణ పౌరుల నుంచి 4శాతం నుంచి 9.1 శాతం వడ్డీ రేటు తో ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే రూ.2  కోట్ల కంటే తక్కువ డిపాజిట్లను ఇప్పుడు స్వీకరించడం మొదలుపెట్టారు.. అందుకే ఇప్పుడు 9.60% వరకు సీనియర్ సిటిజెన్లకు వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు ఆ బ్యాంకు తన ప్రకటనలలో తెలిపింది. ముఖ్యంగా ఐదు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పై సాధారణ కష్టమర్లకు 9.1 శాతం వడ్డీ , సీనియర్ సిటిజనులకు 9.6% వడ్డీ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: