ఎట్టకేలకు జవాన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!!

Divya
బాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో షారుక్ ఖాన్ కూడా ఒకరు.. గడచిన కొన్ని సంవత్సరాల నుంచి వరుస ప్లాపులతో సతమతమవుతున్న షారుక్ ఖాన్.. పఠాన్ చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం స్పై యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తన తదుపరి చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు షారుఖ్ ఖాన్.. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తూ ఉన్నారు.

ఈ సినిమా గతంలో అనౌన్స్ చేసిన చిత్ర బృందం ప్రస్తుతం వరుస అప్డేట్లను ఇస్తూ అభిమానులను తెగ  ఖుషి చేస్తోంది. ఈ సినిమాలో మరొకసారి షారుక్ తన యాక్షన్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఈ సినిమాలో తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నారు. అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా మొదట జూన్ -2 వ తేదీ విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయ్యారు. కానీ తాజాగా జవాన్ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం వాయిదా వేస్తూ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.

జవాన్ మూవీ సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయ్యింది. ఈ మేరకు ఒక అనౌన్స్మెంట్ గ్లింప్స్ సైతం విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తోంది అలాగే దీపికా పదుకొనే ఒక కేమియో పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని గౌరిక నిర్మిస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి విడుదల చేయాలని చిత్తర బృందం పలు సన్నహాలు చేస్తూనే ఉంది. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: