'ఖుషి' హిట్ వాళ్లిద్దరికీ చాలా ముఖ్యం..!!

Anilkumar
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సౌత్ బ్యూటీ సమంత కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఖుషి'. నిన్ను కోరి, మజిలీ వంటి ప్యూర్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో రాబోతున్న మొదటి ఫుల్ లెన్త్ మూవీ ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈ ఇద్దరు కలిసి కీర్తి సురేష్ నటించిన 'మహానటి' సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు మెయిన్ లీడ్స్ గా నటించనుండడంతో సినీ లవర్స్ కూడా ఈ మూవీ కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 విడుదల కాబోతోంది. 

అయితే ఈ సినిమా అటు విజయ్ దేవరకొండకు ఇటు సమంతకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత ఈ సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకుంది. ఇక శాకుంతలం వంటి ప్లాప్ తర్వాత తెలుగులో సమంత నటిస్తున్న సినిమా ఖుషి. అందుకే ఈ సినిమా విజయం సాధించడం సమంతకు చాలా అవసరం. అటు రౌడి హీరో విషయానికొస్తేమ్.. భారీ అంచనాల నడుమ విడుదలైన 'లైగర్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ రిజల్ట్ తో పూరి జగన్నాథ్ తో తీయాల్సిన 'జనగణమన' ప్రాజెక్టు సైతం క్యాన్సిల్ అయిపోయింది. ఇక లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.

ఈ మూవీ తో ఎలాగైనా సక్సెస్ సాధించి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు ఈ హీరో.కాబట్టి ఈ మూవీ హిట్ అవడం ఇటు విజయ్ దేవరకొండ కూడా ముఖ్యమే. అసలే సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఖుషి' అనే టైటిల్ ని ఈ సినిమాకి కూడా పెట్టారు. దానికి తోడు ఇది కూడా లవ్ స్టోరీనే. కాబట్టి కచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ ఖుషి పవన్ కళ్యాణ్ ఖుషిని మైమరిపిస్తుందేమో చూడాలి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: