హనుమాన్: అంచనాలతో పెరిగిన బాధ్యత.. ఇక తగ్గేదేలె?

Purushottham Vinay
హనుమాన్: జాంబీ రెడ్డి సినిమాతో మంచి సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ సినిమా హనుమాన్. టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో హీరోగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.దీనికి కారణం గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్. ఇందులో వీఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా ఉందంటూ నెటిజన్స్ తెగ పొగిడేశారు.అప్పుడే విడుదలైన ఆదిపురుష్ సినిమా టీజర్ కంటే.. ఈ మూవీ టీజర్ సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను మే 12 వ తేదీన విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉన్నట్లుండి హనుమాన్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు మూవీ మేకర్స్.


''హనుమాన్' సినిమా టీజర్‌పై మీరు చూపించిన ప్రేమాభిమానాలతో మాపై బాధ్యత ఇంకా పెరిగింది. 
హనుమంతుడి స్ఫూర్తికి అద్ధం పట్టేలా ఇంకా మనం కలిసి ఆనందంగా పండుగల సెలబ్రేట్ చేసుకునేలా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తామని మీకు మాట ఇస్తున్నాం.త్వరలోనే సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం' అని తెలిపారు.ఈ సినిమాని భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా మెప్పించేలా రూపొందిస్తున్నారు. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, స్పానిష్, చైనీస్, జపనీస్, కొరియన్ ఇంకా ఇంగ్లీష్ ఇలా ఏకంగా 11 భాషలలో ఈ మూవీని రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పై కె నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో తేజా సజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్ ఇంకా గెటప్ శ్రీను కీలకపాత్రలలో నటిస్తుండగా.. గౌరహరి, అనుదీప్ దేవ్ అలాగే కృష్ణ సౌరభ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: