"విక్రమ్ వేద" హిందీ మూవీ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్నటువంటి హీరోలు అయినా హృతిక్ రోషన్ ... సైఫ్ అలీ ఖాన్ కలిసి కొంత కాలం క్రితం విక్రమ్ వేద అనే సినిమాలో హీరోలుగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంలో రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించినటువంటి విక్రమ్ వేద అనే సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ తమిళ వర్షన్ కు దర్శకత్వం వహించినటువంటి పుష్పర్ - గాయత్రి లు ఈ సినిమా హిందీ వర్షన్ కు కూడా దర్శకత్వం వహించారు.

తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించిన విక్రమ్ వేద సినిమాను హిందీ లో రీమేక్ చేయడం ... అలాగే హిందీ శని పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్నటువంటి హీరోలు అయినా హృతిక్ రోషన్ ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో హీరోలుగా నటించడంతో ఈ మూవీ పై హిందీ సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ పోయిన సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను జియో సినిమాస్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఈ సంస్థ మే 12 వ తేదీ నుండి జియో సినిమాస్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: