"ఏజెంట్" లాంటి ఫ్లాప్ తర్వాత స్టార్ హీరోతో సినిమా చేయనున్న సురేందర్ రెడ్డి..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టైలిష్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అతనొక్కడే మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను ప్రారంభించి మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ సక్సెస్ ను అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న సురేందర్ రెడ్డి ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతో మంది నటులతో సినిమాలను తెరకెక్కించి వాటిలో ఎక్కువ శాతం మూవీ లతో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు అక్కినేని అఖిల్ హీరో గా రూపొందినటువంటి ఏజెంట్ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా ... ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. మమ్ముట్టి మూవీ లో కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

ఇలా ఏజెంట్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను ఎదుర్కొన్న సురేందర్ రెడ్డి తన తదుపరి మూవీ ని టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ తో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దర్శకుడు అల్లు అర్జున్ కోసం ఒక కథను రెడీ చేస్తున్నట్లు ... ఒక వేళ ఆ కథ కనుక అల్లు అర్జున్ కు నచ్చినట్లు అయితే వీరి కాంబినేషన్ లో మూవీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇదివరకే అల్లు అర్జున్ ... సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రేసుగుర్రం మూవీ రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: