అలాంటి సినిమాలో నటించాలని ప్రభాస్ అనుకుంటున్నాడట..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ ఇండియా మూవీ లలో ... పాన్ వరల్డ్ మూవీ లలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ ... ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందినటువంటి ఆది పురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా హిందీ , తెలుగు , కన్నడ , తమిళ , మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ లోను ... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లోను ... మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లోను హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ ల షూటింగ్ లు పూర్తి కాగానే ప్రభాస్ ... సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందబోయే స్పిరిట్ అనే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇలా ఇప్పటికే వరస మూవీ లకు కమిట్ అయిన ప్రభాస్ ప్రస్తుతం ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథలో నటించాలని ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ప్రభాస్ కు సెట్ అయ్యే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను చెప్పినట్లు అయితే ప్రభాస్ వెంటనే ఆ కథను ఓకే చేయడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ చాలా సంవత్సరాల క్రితం దశరథ్ దర్శకత్వంలో రూపొందినటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ అనే పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాతి నుండి ప్రభాస్ ఇప్పటివరకు పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథలో హీరో గా నటించ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: