అఫీషియల్ : ప్రభాస్ "ఆది పురుష్" మూవీ ట్రైలర్ ఆ తేదీన విడుదల..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందినటువంటి మిర్చి సినిమా వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన ప్రభాస్ ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటువంటి బాహుబలి సిరీస్ మూ వీల ద్వారా భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ ఇప్పటికే సాహో ... రాదే శ్యామ్ అనే రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో హీరో గా నటించాడు. ఈ మూవీ లు ప్రభాస్ కు భారీ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందించ లేక పోయాయి.
 

ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన ఆది పురుష్ అనే సినిమా జూన్ 16 వ తేదీన విడుదల కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించగా ... కృతి సనన్ ఈ సినిమాలో ప్రభాస్ కు జోడి గా నటించింది. ప్రభాస్ ఈ మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా ... కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో కనిపించబోతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మే 9 వ తేదీన హిందీ , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: