హనుమాన్ మూవీ పోస్ట్ ఫోన్ కావడానికి కారణం..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో మూడు సినిమాలతోనే ఆడియో సంపాదించుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. చైల్డ్ ఆర్టిస్టుగా మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు తేజ సజ్జాతో.. తెరకెక్కించిన జాంబిరెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా హనుమాన్.. ఈ సినిమా శ్రీరామ భక్తుడు హనుమంతుడి సూపర్ హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెలకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా మొదటినుంచి ఎటువంటి అంచనాలు లేకుండా టీజర్ విడుదలయ్యాక మంచి హైప్ ఏర్పడింది.

ఈ సినిమా టీజర్ లోని కొన్ని షాట్స్ టేకింగ్ యాక్షన్ సీన్స్ అందరినీ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టీజర్ల గ్రాఫిక్స్ ఆడియన్స్ని ఫిదా అయ్యేలా చేశాయి.ఈ సినిమా 11 భాషలలో మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామంటే చిత్ర బృందం ప్రకటించింది తాజాగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేయబోతున్నట్లు చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేసింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా తెలియజేసింది అలాగే వాయిదా వేయడానికి గల కారణాన్ని కూడా తెలియజేయడం జరిగింది.

ముఖ్యంగా ఈ సినిమా టీజర్ కి వచ్చిన రెస్పాన్స్తో ఈ సినిమా 30 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీంతో చిత్ర బృందంపై చాలా పెద్ద బాధ్యత ఏర్పడింది ప్రేక్షకుల నమ్మకం నిలబెట్టుకునేలా ఈ సినిమాని చేస్తున్నాము కాబట్టి అందుకోసం కాస్త సమయం కావాలని తెలియజేశారు. అయితే ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ చిత్రం పైన ఎక్కువగా ట్రోల్ చేయడం జరిగింది.హనుమాన్ లోని గ్రాఫిక్స్ ని పోలుస్తూ ఆది పురుష్ సినిమాని ట్రోల్ చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రిలీజ్ ని వెనక్కి తీసుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గ్రాఫిక్స్ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: