కమలహాసన్ నిర్మాణంలో సాయి పల్లవి కొత్త సినిమా..!!

Divya
టాలీవుడ్ లో లేడీ పవర్ ట్యాగ్ అనే బిరుదును సంపాదించింది హీరోయిన్ సాయి పల్లవి. మొదట ఫిదా సినిమాతో తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. గత ఏడాది విరాటపర్వం, గార్గి వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక తర్వాత మరే సినిమాలను కూడా ఇమే ప్రకటించలేదు. దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పేసిందనే వార్తలు ఎక్కువగా వినిపించాయి.

దీంతో అభిమానులంతా చాలా నిరుత్సాహపడ్డారు. తాజాగా వీరందరికీ ఒక గుడ్ న్యూస్ తెలిపే విధంగా తన కొత్త సినిమా చేస్తోంది. తమిళ హీరో శివ కార్తికేయ 21వ సినిమాలు ఈమె హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా నిన్నటి రోజున చాలా ఘనంగా జరిగాయి. ఈ సినిమాని ఉలగయగన్ కమలహాసన్ నిర్మిస్తూ ఉన్నారు.రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకం పైన ఈ సినిమా అని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్ ఎక్కువ కూడా కమలహాసన్ శివ కార్తికేయ సాయి పల్లవి హాజరు అవ్వడం జరిగింది. దర్శకత్వం రాజ్కుమార్ పెరియాస్వామి వ్యవహరిస్తున్నారు.

కమలహాసన్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉండడంతో శివ కార్తికేయన్, సాయి పల్లవి చాలా ఫ్రెష్ కాంబినేషన్ కావడంతో ఆడియన్స్ కు కూడా ఈ సినిమా పైన మంచి బస్ ఏర్పడుతోంది 2024 లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఎట్టకేలకు సాయి పల్లవి సినిమాలలో నటించడంతో అభిమానులు కాస్త ఆనందంగా ఫీల్ అవుతున్నారు అయితే ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదల చేస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: