మెగా హీరోస్ షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... మెగాస్టార్ చిరంజీవి మూవీ ల షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయో తెలుసుకుందాం.
గేమ్ చేంజర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా కియార అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని శంషాబాద్ ప్రాంతంలో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ రామ్ చరణ్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ , సునీల్ , అంజలి ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు.
ఓజి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓ జి" మూవీ షూటింగ్ ప్రస్తుతం పూణే పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం ప్రియాంక పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
భోళా శంకర్ : మెగాస్టార్ చిరంజీవి హీరో గా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం కోల్కతా నగరం లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ చిరంజీవి పై ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది  ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో ఈ మూవీ లో కనిపించబోతున్నాడు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ మూడు మూవీ లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: