అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న దబాంగ్ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందినటువంటి దబాంగ్ మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో సోనాక్షి తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకులను కట్టి పాడేయడంతో ఈ మూవీ తర్వాత సోనాక్షి కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలను అవకాశాలు దక్కాయి .
 

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమా లలో నటించిన సోనాక్షి ప్రస్తుతం హిందీ పరిశ్రమలో మోస్ట్ క్రేజీ నటి గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ముద్దు గుమ్మ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా రూపొందినటువంటి లింగ మూవీ లో రజనీ కాంత్ సరసన హీరోయిన్ గా నటించింది.
 

ఈ మూవీ పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ ఈ సినిమా ద్వారా తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా సోనాక్షి మంచి గుర్తింపు ను సంపాదించుకుంది . ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సోనాక్షి తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందు లో భాగం గా తాజాగా సోనాక్షి అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: