ఆ తేదీన "ఎమ్మెస్ ధోని ది అంటోల్డ్ స్టోరీ" మూవీ రీ రిలీజ్..!

Pulgam Srinivas
భారత క్రికెటర్ మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోని జీవిత కథ ఆధారంగా "ఎమ్ ఎస్ ధోని ది అంటోల్డ్ స్టోరీ" అనే బాలీవుడ్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరో గా నటించగా కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ లో దిశా పటాని ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా ... అనుపమ్ కేర్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో మరియు క్రికెట్ ప్రేమికుల్లో భారీ అంచనాలు పెరిగి పోయాయి.
 

అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా 30 సెప్టెంబర్ 2016 వ సంవత్సరం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాక్స్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభించడం మాత్రమే కాకుండా చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. ఈ మూవీ ద్వారా సుశాంత్ సింగ్ రాజ్పుత్ కు కియార అద్వానీ కి దిశా పటాని కి మంచి గుర్తింపు లభించింది.

ఇలా ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 12 వ తేదీన థియేటర్ లలో చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: