గ్లింప్స్.. తో జైలర్ సినిమా రిలీజ్ డేట్.. వీడియో వైరల్..!!

Divya

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన రజనీకాంత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రస్తుతం రజనీకాంత్ వయసు 73 సంవత్సరాలు అయినప్పటికీ యంగ్ అండ్ డైనమిక్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. తాజాగా జైలర్ సినిమాలో నటిస్తున్న రజినీకాంత్ ఈ సినిమా పైన ఆశలు పెట్టుకున్నారు.అయితే ఇందులో అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటిస్తూ ఉన్నది. గతంలో వీరిద్దరి కలయికలు ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి కానీ నరసింహ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు.

అయితే ఈసారి రజనీకాంత్ తో జతకట్టేందుకు అవకాశం రావడంతో నటిస్తోంది.దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి సెంట్రల్ జైలు నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో సాగే ఈ కథకు రజనీకాంత్ లుక్కు చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా అనిరుద్ రవిచంద్రన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తోంది. జైలర్ చిత్రం నుంచి ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా ఆగస్టు 10వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు ఒక చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో స్టార్ కాస్టింగ్ మొత్తాన్ని చూపించడం జరిగింది.

ఇందులో ఎంతోమంది నటీనటులు నటిస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ లోనే అన్ని పరిశ్రమల నుంచి స్టార్ నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కనడాలో హీరో శివరాజ్ కుమార్.. మలయాళం నుంచి మోహన్ లాల్.. యోగి బాబు, నాగబాబు, సునీల్ వంటి ప్రముఖులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. సునీల్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రజనీకాంత్ కు మరి జైలర్ సినిమాతో నైనా కాస్త ఊరట లభిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: