కాజల్ గురించి వస్తున్న ఆ రూమర్ నిజమేనా...?

murali krishna
కాజల్ అగర్వాల్ ఒక స్టార్ హీరోతో ప్రేమలో పడిందా అతనితో అంత క్లోజ్ గా కూడా మూవ్ అయ్యిందా అంటే అవునని అంటున్నారట నెటిజన్స్
ఇక ఇంత రచ్చ జరుగుతున్న కూడా తన భర్త మాత్రం ఏమీ అనకుండా సైలెంట్ గా ఉన్నాడని అయితే తెలుస్తుంది. భార్య గురించి అన్ని మాటలు వినిపిస్తుంటే కనీసం భర్త ఏవిధంగా కూడా స్పందించకపోయేసరికి కొందరు జనాలు అనుమానం పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి కూడా ఒక కారణంఅయితే ఉందని తెలిసింది.
టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది. లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు ఆమె పరిచయం అయింది కాజల్. ఆ తరువాత మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్ సరసన నటించింది. ఇక ఈమెకు టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా కూడా ఇదే అని చెప్పొచ్చు. ఆ తరువాత చాలావరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక తన చిన్ననాటి స్నేహితుడు మరియు బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లు తో కొంతకాలం రిలేషన్షిప్ లో ఉండి.. అతడిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా టూర్స్ ప్లాన్స్ వేస్తూ సంతోషకరమైన జీవితాన్ని అయితే గడుపుతుంది. సంవత్సరం కిందట పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. బాబు పుట్టాక కూడా కాజల్ అందంలో ఎటువంటి మార్పు అయితే లేదు. పైగా మునిపటి రూపం సంపాదించుకోవడం కోసం తెగ వర్కౌట్లు కూడా చేసింది. అంతేకాకుండా సినిమాలలో అవకాశాలు రావటంతో వాటికీ కూడా  సైన్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఓ సినిమాలో బిజీగా ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే కాజల్ గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ పై ఎటువంటి గాసిప్ లు రాలేదు.కానీ ఇప్పుడు ఈ బ్యూటీ గురించి ఒక వార్త వినిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో ఆర్య 2 సినిమాలో నటించినప్పుడు ప్రేమాయణం నడిపిందని.. అందుకే ఆ సినిమాలో లిప్ కిస్ కు కూడా ఆమె ఒప్పుకుందని కొందరు తెగ హంగామా చేశారు. కానీ కొంతకాలం తర్వాత కాజల్ తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోగా అవన్నీ కూడా కేవలం పుకార్లే అని తెలిసిపోయింది. కానీ కొంతమంది  మాత్రం మళ్లీ అదే విషయాన్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి రచ్చ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం గురించి అప్పట్లో కానీ ఇప్పుడు కాని కాజల్ అస్సలు స్పందించలేదు. కనీసం తన భర్త గౌతం కూడా వార్తల గురించి కాజల్ ని ప్రశ్నించలేదని తెలుస్తుంది. అయితే దానికి కారణం కూడా ఒకటి ఉందని తెలుస్తుంది. అదేంటంటే సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు ఇటువంటి పుకార్లు రావడం కొత్త విషయమేమీ కాదు అనుకోని అతడు సైలెంట్ గా ఉన్నాడట. దీంతో కొందరు కాజల్ భర్త చాలా మంచి వాడని.. కాజల్ ను బాగా అర్థం చేసుకున్నాడని కూడా అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: