అక్కడ ప్రారంభమైన చిరంజీవి కొత్త సినిమా నెక్స్ట్ షెడ్యూల్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే సిస్టర్ సెంటిమెంట్ తో సాగే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి వేదాలం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఈ తమిళ సినిమాలో అజిత్ హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే భోళా శంకర్ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది  ఇది వరకే వీరి కాంబినేషన్ లో సైరా నరసింహా రెడ్డి అనే మూవీ రూపొందింది.

ప్రస్తుతం రూపొందుతున్న భోళా శంకర్ మూవీ వీరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా ... మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ ను ఈ మూవీ బృందం కోల్కత్తా ప్రారంభించింది.  కోల్కత్తా లో ఈ మూవీ బృందం ఈ సినిమా లోని అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ యువ నటుల్లో ఒకరు అయినటువంటి సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... శ్రీ ముఖి ఏ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: