ప్రభాస్ గొప్పతనాన్ని చెప్పుకొచ్చిన జబర్దస్త్ మహేష్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ వ్యక్తిత్వం గురించి కూడా ప్రత్యేకంగా జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఈవెంట్ లలో ... పబ్లిక్ ఫంక్షన్ లకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయడంలో మాత్రం చాలా ముందు వరుసలో ఉంటాడు. మరి ముఖ్యంగా ప్రభాస్ ఎవరికైనా భోజనం పెట్టాలి అంటే అందరి కంటే ముందు వరుసలో నిలబడతాడు.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ తన షూటింగ్ స్పాట్ లో ఉన్న వారందరికీ అదిరిపోయే రేంజ్ భోజనం పెడుతుంటాడు అని ఇది వరకు ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు మరియు చిన్న సెలబ్రిటీలు కూడా చెప్పుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని రంగస్థలం మూవీ ద్వారా అద్భుతమైన నటుడుగా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న జబర్దస్త్ మహేష్ ... ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజాగా జబర్దస్త్ మహేష్ ... ప్రభాస్ గురించి మాట్లాడుతూ ... షూటింగ్ లో రెండు వందల మంది ఉంటే రెండు వందల మంది కి ...  300 మంది ఉంటే 300 మంది కి ప్రభాస్ గారి తరఫు నుండి ఫుడ్ వచ్చేస్తుంది. నాకు ఏ ఐటెం నచ్చిందో అడిగారు. మటన్ అని చెప్తే ఆ తర్వాతి రోజు నాకు అదే ఐటెం వచ్చేలా చేశారు. ప్రభాస్ గారు చాలా రోజుల తర్వాత చెక్స్ షర్ట్స్ వేసుకొని అదిరిపోయే రేంజ్ కామెడీ రోల్ చేస్తున్నాడు అని జబర్దస్త్ మహేష్ ...  మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మూవీ గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ ... మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: