వైరల్ అవుతున్న "భోళా శంకర్" మూవీ వర్కింగ్ స్టిల్స్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ఇప్పటికే వాల్టేర్ వీరయ్య మూవీ తో పవర్ఫుల్ మాస్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. వాల్తేరు వీరయ్య మూవీ తో సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా తమిళ మూవీ వేదాలం కు అధికారిక రీమేక్ గా రూపొందుతుంది.

ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. యాంకర్ శ్రీ ముఖి ఈ మూవీ లో మరో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. యాంకర్ శ్రీ ముఖి ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

 మే డే సందర్భంగా ఈ సినిమా నుండి చిరంజీవి కి సంబంధించిన కొన్ని పోస్టర్ లను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ అనిపించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. వీటిలో చిరంజీవి మరియు దర్శకుడు మెహర్ రమేష్ ఉన్నారు. ప్రస్తుతం భోళా శంకర్ మూవీ షూటింగ్ స్పాట్ నుండి బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే బోలా శంకర్ మూవీ పై మెగా అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: