అఫీషియల్ : "ఆది పురుష్" ట్రైలర్ విడుదల తేదీ... టైమ్ ప్రకటన..!

Pulgam Srinivas
ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న సినిమా లలో ఆది పురుష్ మూవీ ఒకటి. ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కృతి సనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనుండగా ... కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతుంది.

 ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. ఈ మూవీ కి మూవీ మేకర్స్ ఎక్కువ రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయాన్ని కేటాయించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో రావణాసురుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ని హిందీ , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఒక అధికారిక ప్రకటనను ప్రకటించింది. ఆది పురుష్ మూవీ యొక్క 3D ట్రైలర్ ను మే 9 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: