అఫీషియల్ : "ఖుషి" మూవీ ఆడియో హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో ... హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ... సమంత ప్రస్తుతం కలిసి ప్రస్తుతం ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది వరకే వీరిద్దరు కలిసి మహానటి మూవీ లో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీ కి ప్రేమ కథలను అద్భుతంగా తెరకెక్కిస్తాడు అని పేరు కలిగినటువంటి దర్శకులలో ఒకరు అయినటు వంటి శివ నిర్వణ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాకు అస్సాం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో ఒకే రోజు విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులను సరిగమ సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా కాలం అవుతుంది. అలాగే ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ మూవీ మేకర్స్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: