ఆడియో రైట్స్ ద్వారా హైయెస్ట్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 5 సౌత్ మూవీలు ఇవే..!

Pulgam Srinivas
కొన్ని సినిమాల ఆడియో పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో వాటి ఆడియో రైట్స్ కు కూడా అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు సౌత్ ఇండియా మూవీ కా నుండి హైయెస్ట్ ఆడియో రైట్స్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
పుష్ప ది రూల్ : అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ అన్ని భాషల ఆడియో హక్కులకు కలిపి ఏకంగా 65 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యొక్క ఆడియో హక్కులు 26 కోట్లకు అమ్ముడు పోయాయి.
పొన్నియన్ సెల్వన్ : మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష కీలక పాత్రల్లో రూపొందిన ఈ మూవీ యొక్క ఆడియో హక్కులు 24 కోట్లకు అమ్ముడు పోయాయి.
సాహో : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా సుజిత్ దర్శకత్వం లో రూపొందిన ఈ మూవీ యొక్క ఆడియో హక్కులు 22 కోట్లకు అమ్ముడు పోయాయి.
లియో : తలపతి విజయ్ హీరో గా త్రిష హీరోయిన్ గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపాందుతున్న ఈ మూవీ యొక్క ఆడియో హక్కులు 16 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: