"పుష్ప 2" లో కీలక పాత్రలో ఆ నటి కం ప్రొడ్యూసర్..?

Pulgam Srinivas
అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 1" మూవీ తో అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సమంత ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.

 ఫహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ లో సునీల్ , అనసూయ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు. రావు రమేష్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెండవ భాగం షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ని మొదటి భాగం కంటే రెండవ భాగాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక వీడియోను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించి నా ఒక అప్డేట్ వైరల్ అవుతుంది. ఈ మూవీ లో కొణిదల నాగబాబు కూతురు ... నటి మరియు ప్రొడ్యూసర్ అయినటువంటి నిహారిక ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన నిహారిక కొంత కాలం క్రితం చిరంజీవి హీరో గా రూపొందిన పాన్ ఇండియా మూవీ సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. ఈ పాత్ర ద్వారా ఈ ముద్దు గుమ్మకు మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: