సలార్ మూవీ పై జగపతిబాబు షాకింగ్ కామెంట్స్..!

Divya
జగపతిబాబు తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా డింపుల్ హయాతి హీరోయిన్గా తెరకెక్కుతున్న రామబాణం సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మే 5వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చిత్ర బృందం ప్రమోషన్స్ జోరుగా సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రెస్ మీట్ లో పాల్గొన్న జగపతిబాబు ప్రభాస్ నటించిన సలార్ సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది.. జగపతిబాబు విషయానికి వస్తే.. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు విలన్ గా మారి పలు చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. రంగస్థలం, లెజెండ్, నాన్నకు ప్రేమతో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో ఆయన విలన్ గా నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారని చెప్పాలి.
ఇకపోతే ప్రభాస్ ప్రధాన పాత్రలో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తి అవుతుంది? ఎప్పుడు విడుదలవుతుందని అభిమానుల సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఆయన మాట్లాడుతూ.. తాను కేవలం ఐదు రోజుల షెడ్యూల్లో మాత్రమే పాల్గొన్నాను అంటూ తెలిపారు..
ఇక ఐదు రోజులు ఒకే ఒక సన్నివేశం మాత్రమే చిత్రీకరించారు అని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అసాధారణమైన టాలెంట్ కలిగి ఉన్న వ్యక్తి అందుకే తాను సలాడ్ సినిమా స్టోరీ గురించి.. తన క్యారెక్టర్ గురించి ఎక్కువగా అడగలేదు అంటూ తెలిపారు. ఇకపోతే తాను నటించింది..ఐదు రోజుల షూటింగ్ అయినా సరే అది పవర్ఫుల్ పాత్ర అని.. తన పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుంది అంటూ స్పష్టం చేశారు జగపతిబాబు.. మొత్తానికి అయితే జగపతిబాబు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: