హాట్ టాపిక్ గా మారిన మహేష్ దుబాయ్ మిషన్ !

Seetha Sailaja
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలో నటిస్తూనే అనేక వ్యాపారాలలో భాగస్వామిగా కొనసాగుతూ అనేక విలువైన ఆస్థులను చాలముందు చూపుతో ఏర్పరుచుకుంటున్నాడు. మహేష్ బిజినెస్ వ్యవహారాలను అతడి భార్య నమ్రత చాల శ్రద్ధగా గమనిస్తూ ఉండటమే కాకుండా ఆ వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్.

అవకాశం చిక్కితే చాలు మహేష్ తన భార్య పిల్లలతో తరుచు విదేశీ పర్యటనకు వెళ్ళిరావడం అతడికి ఒక అలవాటు. ఒకవైపు మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తూనే గ్యాప్ దొరికినప్పుడల్లా హాలిడే స్పాట్ కు వెళుతున్నాడు. ఈమధ్యనే ప్యారిస్ జర్మనీ తన భార్య నమ్రత పిల్లలతో వెళ్ళి వచ్చిన మహేష్ బాబు లేటెస్ట్ గా దుబాయ్ వెళ్ళివచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దుబాయ్ ట్రిప్ కు ఒక ప్రత్యేకత ఉంది అని టాక్.

దుబాయ్ లో అత్యంత విలాసవంతమైన ఒక విల్లాను మహేష్ కొన్నట్లు తెలుస్తోంది. ఈ విల్లా రిజిస్ట్రేషన్ కోసం తన భార్య నమ్రత తో మహేష్ బాబు అక్కడకు వెళ్ళి ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో చాలామంది బాలీవుడ్ సెలెబ్రెటీలు దుబాయ్ లో విలాసవంతమైన విల్లాలను కొంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మహేష్ కూడ చేరిపోయాడు అనుకోవాలి. ఇప్పుడు ఈవార్త టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది.

త్రివిక్రమ్ తో నటిస్తున్న మూవీ షూటింగ్ వీలైనంత త్వరలో పూర్తి చేయాలి అని మహేష్ భావిస్తున్నప్పటికీ ఈ మూవీ స్క్రిప్ట్ లో వస్తున్న సమస్యలు వల్ల ఈ మూవీ షూటింగ్ పలుసార్లు వాయిదా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ తరువాత మహేష్ రాజమౌళిల మూవీ పాన్ వరల్డ్ మూవీ స్థాయిలో నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈమూవీ విడుదల తరువాత మహేష్ రేంజ్ ఇంటర్ నేషనల్ స్టార్ గా మారే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: