ఆది పురుష ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?

Divya
టాలీవుడ్ లో హీరో ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో నటించిన చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని నార్త్ లో బాగా ప్రచారం చేయడానికి చిత్ర బృందం సిద్ధమయ్యింది. అయోధ్య వారణాసి లాంటి పవిత్రమైన స్థలాలలో ఈ చిత్రం కోసం భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఈవెంట్లను ఎలా ప్లాన్ చేయాలి ఎక్కడ చేయాలని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఈవెంట్ ను భద్రాచలం తిరుపతిలో జూన్ 1వ తేదీన ఈవెంట్ను ప్లాన్ చేయాలని చిత్ర బృందం అనుకుంటున్నాటుగా సమాచారం.
అయితే ఈ సినిమా ప్రమోషన్లో ముందు నుంచే పక్కా స్కెచ్ తో ప్లాన్ వేస్తున్నారు డైరెక్టర్ ఓం రౌత్. ఇక ప్రభాస్ కూడా మీడియా ముందుకు వచ్చి ఆదీ పురుష్ సినిమా ప్రచారానికి సమయాన్ని కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. రాముడిగా ప్రభాస్ నటించిన సీత పాత్రలో కృతి సనన్, రావణాసుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. టీజర్ తో విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం VFX నీ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తిరిగి నిర్మించగా మంచి బస్ ఏర్పడుతోంది.
ఇక ఈ సినిమా నుంచి తాజాగా అప్డేట్లు సైతం వెలుబడుతూనే ఉన్నాయి మే 9వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ ,హిందీ, మలయాళం వంటి భాషలలో ఒకేసారి ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా పలు థియేటర్లలో ఈ సినిమా ట్రైలర్ను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నట్లు సమాచారం.. అయితే ఈ సినిమా ట్రైలర్ ని ఎక్కడెక్కడ ఏయే థియేటర్లో విడుదల చేయబోతున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈ సినిమా మాత్రం 3డి రూపంలో ప్రేక్షకులను అలరించడానికి జూన్ 16వ తేదీన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: