మెగాస్టార్ తో ఒక్కసారైనా.. రొమాన్స్ చేయాలనుంది : కుష్బూ

praveen
నిన్నటి తరంలో తిరుగులేని తారగా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కుష్బూ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం కన్నడం అనే తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది. స్టార్ హీరోలు అందరీ సరసన జోడి కట్టి ఎన్నో సూపర్ హిట్లను  కూడా సొంతం చేసుకుంది. ఇక తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది అనడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో కుష్బూ ఎంత హవా నడిపించింది అంటే అభిమానులు ఏకంగా హీరోయిన్ ఖుష్బూకి ఒక గుడి కట్టించి పూజలు చేశారు అంటే ఇక కుష్బూ ఎంత పెద్ద స్టార్ హీరోయిన్గా వెలుగొందిందో అర్థం చేసుకోవచ్చు.

 అయితే ఇక ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు తగ్గినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కనిపిస్తుంది. ఇకపోతే గోపీచంద్ హీరోగా నటించిన రామ బాణంలో ఒక కీలక పాత్రలో నటించింది కుష్బూ. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో కుష్బూ బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుష్బూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన అభిమాన హీరోతో ఇప్పటివరకు రొమాన్స్ చేసే అవకాశం రాలేదు అంటూ బాధపడింది.  ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.

 మెగాస్టార్ చిరంజీవి ఒక లెజెండ్.. ఆయనకు వర్క్ పై ఫ్యాషన్.. ప్రతిరోజు సెట్స్ లో కొత్తగా కనిపిస్తారు.. ప్రతిరోజు ఇంకా ఏదైనా చేయాలని ఆరాటపడుతుంటారు. నా జీవితంలో బిగ్గెస్ట్ డ్రీమ్ ఒక్కటే చిరంజీవితో రొమాన్స్ చేయడం..  కానీ అది ఇప్పటివరకు నెరవేరలేదు.. స్టాలిన్ సినిమాలో మేమిద్దరం కలిసి నటించాం.. కానీ ఆయనతో ఏదైనా లవ్ స్టోరీ లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించాలని ఉంది. ఈ కల నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నా అంటూ కుష్బూ చెప్పుకొచ్చింది. ఇక రామబాణం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయని తప్పక విజయం సాధిస్తుంది అని కుష్బూ అభిప్రాయపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: