రష్మికతో డేటింగ్ లో లేను.. క్లారిటీ ఇచ్చిన హీరో?

praveen
సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్చల్ చేస్తూనే ఉంటుంది అని చెప్పాలి. ఒకవేళ ఒక హీరో హీరోయిన్ ఒకచోట కలిసి కనిపించారు అంటే చాలు.. ఇక వారిద్దరు డేటింగ్ లో ఉన్నారు అని నేటిజన్స్ అందరూ కూడా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇదే ప్రచారం చేయడం మొదలు పెడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటి వార్తల్లో కొన్ని నిజం అయితే మరికొన్ని మాత్రం కేవలం పుకార్లు గానే మిగిలిపోతూ ఉంటాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి కూడా ఇలాంటి వార్త ఒకటి గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

 ఒకప్పుడు రష్మిక మందన్న అటు విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉందని.. వీరిద్దరూ కూడా డీప్ లవ్ లో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక వీరిద్దరూ ఏకంగా మాల్దీవ్స్ వెళ్లి ఎంజాయ్ చేశారంటూ కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. పైకి తాము మంచి స్నేహితులం అని చెప్పుకుంటున్న అసలు మ్యాటర్ మాత్రం ఇంకేదో ఉంది అంటూ అందరూ చర్చించుకున్నారు. అయితే ఇటీవలే మరో హీరోతో రష్మికకు డేటింగ్ అంటగట్టారు నెటిజన్స్.  ఏకంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రష్మిక డేటింగ్ లో ఉంది అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

 అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవలే ముంబై ఎయిర్పోర్టులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి రష్మిక మందన్న కనిపించింది. దీంతో ఈ వార్తలు ఒక్కసారిగా తెరమీదకి వచ్చాయి. అయితే ఇటీవల నేషనల్ క్రష్ రష్మికతో డేటింగ్ వార్తలపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పందించాడు. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో తనకు తెలియదు. ఇది పూర్తిగా ఆధార రహితం అంటూ కొట్టి పారేసాడు. ఇది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే ముంబై ఎయిర్పోర్ట్ లో తాము ఇద్దరం కనిపించడంతోనే ఈ వార్తలు వచ్చాయని.. హైదరాబాద్ నుంచి తరచుగా ముంబై వస్తామంటూ బెల్లం కూడా సాయి శ్రీనివాస్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: