ఏకంగా అన్ని సినిమాలలో నటిస్తున్న శ్రీ లీల..!!

Divya
కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల మొదట పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కించడం జరిగింది. హీరోగా రోషన్ ఇందులో నటించారు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మ అందచందాలకు డాన్స్ కు సైతం కుర్రకారులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత రవితేజ నటించిన ధమాక సినిమాలు నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో రవితేజ కూడా శ్రీ లీల స్టార్ హీరోయిన్ అవుతుందని తెలియజేయడం జరిగింది.
రవితేజ అన్నట్టుగానే ఈమె చేతిలో దాదాపుగా అరడైజనుకుపైగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అలా మహేష్ బాబు చిత్రంలో బాలయ్య చిత్రంలో పవన్ కళ్యాణ్ చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాల అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల ఫిక్స్ చేశారు. నిన్నటి రోజున ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీలీల మరింత వైరల్ గా మారుతోంది.

ప్రస్తుతం అందరు హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ వంటి డాషింగ్ హీరోతో నటించాలని కోరుకుంటారు. విజయ్ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఒక క్రేజీ ఉంటుందని చెప్పవచ్చు. అందుకే ఆ అవకాశం కోసం ఎంతో మంది హీరోయిన్లు సైతం ఎదురుచూస్తూ ఉంటారు. విజయ్ దేవరకొండ తో సినిమా అనగానే ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పిందని తెలుస్తోంది. శ్రీ లీల చేతిలో దాదాపుగా పదికి పైగా సినిమాలు ఉన్నాయి అవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలే కాకుండా బడనిర్మాణ సంస్థలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిన్నటి రోజున విజయ్ దేవరకొండ 12వ సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా ఫిక్స్ అయింది. మరి ఈ క్రేజ్ ఈమెకు ఎంతటి పేరు తెస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: