చేసింది ఒక్కటే సినిమా.. కానీ ఖరీదైన ఇల్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీ?
ఇలా ఇప్పటివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో మెరిసిన వారు ఉన్నారు. ఇక ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన కిసి కా భాయ్ కిసికి జాన్ అని సినిమాలో నటించడం ద్వారా బాలీవుడ్ వెండితెరపై అడుగు పెట్టింది బిగ్ బాస్ బ్యూటీ షహనాజ్ గిల్. ఈ క్రమంలోనే తన నటనతో అందం అభినయంతో కూడా ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే ఈ బిగ్ బాస్ బ్యూటీ కాస్త ఇక ఇప్పుడు ఏకంగా ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు.
ఇక ఇందుకు సంబంధించిన వివరాలను అటు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది షహనాజ్ గిల్. దీంతో ఇక సోషల్ మీడియా వేదిక అభిమానులు అందరూ కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే గతంలో షహనాజ్ గిల్ తన కెరియర్ లో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది అన్న విషయం తెలిసిందే పంజాబీ చిత్ర పరిశ్రమంలో తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను అంటూ తెలిపింది. వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా సాధించేది ఏమీ లేదు.. నా విధి రాత ఎప్పుడు మారుతుందో అనే బాధపడ్డ.. మొదట్లో సినిమాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు సెట్ కు తెలిసి మరి అవమానించారు. అప్పుడు సినిమాలు చేయకపోవడమే మంచిదయింది... ఇప్పుడు కలిసి వచ్చింది అంటూ షహనాజ్ గిల్ వ్యాఖ్యానించింది.