ఇమిటేట్ చేసి.. ఇంద్రజ పరువు తీసేసిన హైపర్ ఆది?

praveen
బుల్లితెర కార్యక్రమాల ద్వారా పాపులారిటీ సంపాదించుకుని.. ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ఎంతో సక్సెస్ఫుల్గా కెరియర్ను సాగిస్తున్నాడు కమెడియన్ హైపర్ ఆది. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమంలో తన కామెడీతో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు అని చెప్పాలి. పంచుల సునామీతో ప్రేక్షకులు అందరినీ కూడా కడుపుబ్బా నవ్వించాడు. అయితే మొదట్లో హైపర్ ఆది వేసిన పంచులను ఎంతగానో ఆస్వాదించిన ప్రేక్షకులు కొంతమంది.. ఇప్పుడు మాత్రం హైపర్ ఆది కామెడీ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.

హైపర్ ఆది చేసే కామెడీ మొత్తం ఇతరులను చులకన చేసే విధంగా ఉంటుందని.. బాడీ షేమింగ్ చేసే విధంగా హైపర్ ఆది ఇతర కమెడియన్స్ పై పంచులు వేస్తూ ఉంటాడు అంటూ విమర్శలు చేసిన వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి.  అయితే ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని పొగడ్తలు వచ్చిన పట్టించుకోకుండా.. తనదైన శైలి కామిడీని పంచుతూ ముందుకు సాగుతున్నాడు హైపర్ ఆది. ఇకపోతే ఇటీవల విడుదలైన ప్రోమోలో ఏకంగా జడ్జి ఇంద్రజను ఇమిటేట్ చేస్తూ పంచులు వేసి పూర్తిగా పరువు తీసేసాడు.

 ఒకవైపు మలక్పేట శైలజ మరోవైపు హైపర్ ఆది తాడు పట్టుకుని లాగే గేమ్ లో పాల్గొనగా ఇంద్రజ మాట్లాడుతూ.. శైలజ గారి మీద గెలిస్తే ఆది ఓడిపోయినట్టే అంటూ చెప్పారు. వెంటనే ఆది కలగజేసుకొని మీరు రండి మీ మీద గెలుస్తానని చెప్పారు. ఇంద్రజ స్పందిస్తూ నా మీద గెలిచిన ఆయన చెన్నైలో ఉన్నాడు. నాకు ఒక్కరు చాలు అంటూ కామెంట్ చేసింది. మీరు చెన్నై వెళ్లి మీ ఆయన మీద గెలవండి అంటూ హైపర్ ఆది కామెంట్ చేస్తాడు. ఆ తర్వాత ఇంద్రజ గేమ్ గురించి మాట్లాడుతుండగా.. ఆది కలుగజేసుకొని.. ఇంద్రజ ఎలా చెప్పిందో తెలుసా.. ముందు వంకాయ తీసుకొని ఆ తర్వాత నాలుగు ముక్కలు తరిగి.. ఆ ముక్కలు నూనెలో వేస్తే గుమగుమలాడే వంకాయ కూర రెడీ అంటూ ఇమిటేట్ చేసి పరువు తీసేసాడు  అయితే హైపర్ ఆది వేసిన పంచ్ ఇంద్రజ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: