రాజమౌళి కి కీలక సూచనలు ఇచ్చిన ఆనంద్ మహీంద్రా !

Seetha Sailaja
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటారు. క్షణం తీరికలేని తన కంపెనీ వ్యవహారాలతో సతమతమైపోతున్నప్పటికీ సామాజిక అంశాల పై దేశ చరిత్ర సంస్కృతికి సంబంధించిన అంశాల పై మరీ ముఖ్యంగా సినిమాల పై ఆయన తరుచు సోషల్ మీడియాలో తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటారు.

సినిమాల పట్ల ఆయనకు ఉన్న అభిరుచితో మంచి సినిమాల పై కూడా తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉంటారు. ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ నుండి లేటెస్ట్ గా విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్ 2’ మూవీల పై ఆనంద్ మహేంద్ర తన అభిప్రాయాలు తెలియచేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆనంద్ ఆ ఫోటోను రాజమౌళికి షేర్ చేస్తూ ఇలాంటి చారిత్రాత్మక విషయాల పై కూడ సినిమాలు తీస్తే బాగుంటుందని సూచించారు.

ఆఫోటో క్రీస్తుపూర్వం కాలానికి చెందిన మొహంజదారో కాలానికి సంస్క్రతికి చెందినది. చిన్నప్పుడు చదువుకున్న ప్రతివ్యక్తి అతడి సోషల్ పుస్తకాలలో సింధులోయ నాగరికత గురించి చదువుకుని ఉంటాడు. అందులోనే మొహంజొదారో సంస్కృతికి చెందిన ఫోటోలు చూసిన వారికి క్రీస్తు జనానికి ముందే మనదేశంలో అధునాతనమైన ఆలోచనలతో జీవన విధానం గృహనిర్మాణం జరిగిందని తెలుస్తుంది. అయితే ఆసంస్కృతి అంతా కాలగర్భంలో కలిసిపోయింది.

అలనాటి సంస్కృతి గురించి నేటితరం వారికి ఏమాత్రం తెలియదు. దీనితో అలనాటి సంస్కృతిని చరిత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ రాజమౌళి లాంటి వ్యక్తి సినిమా తీస్తే బాగుంటుందని ఆనంద మహేంద్ర ఆలోచన. అయితే హాలీవుడ్ స్థాయిలో పూర్తి యాక్షన్ మూవీని తీయాలని ఆలోచన చేస్తున్న రాజమౌళి ఈ పారిశ్రామికవేత్త ఇచ్చిన సూచనలను ఎంతవరకు పాటిస్తాడు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. అయితే కొన్ని సంవత్సరాల క్రితం హృతిక్ రోషన్ హీరోగా చేసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ తీసిన ‘మొహంజదారో’ సూపర్ ఫ్లాప్ అయిన విషయం ఈ పారిశ్రామిక వేత్త మరిచిపోయి ఉంటారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: