మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం కుదురిందా..?

shami
నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఉండగా అప్పుడు ఇప్పుడు అంటూ వారిని నిరాశపరుస్తున్నారు. లెజెండ్, శాతకర్ణి సినిమాల టైం లోనే వారసుడి కెమియో ఉంటుందని హడావుడి చేశారు కానీ అదేమి జరగలేదు. అయితే ఈసారి మాత్రం పక్కాగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. బోయపాటి శ్రీను బాలకృష్ణ త్వరలో అఖండ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ సినీమలో మోక్షజ్ఞ కూడా ఉంటాడని చెబుతున్నారు.
జూన్ 12న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఎనౌన్స్ చేస్తారట. అఖండతో బాలకృష్ణ మరోసారి తన సత్తా చాటగా అఖండ 2 సరికొత్త కథతో మరో రేంజ్ చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో మోక్షజ్ఞ ఉండటం కూడా ఫ్యాన్స్ కి ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ కలుగ చేస్తుంది. అయితే సోలో హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం కొన్నాళ్లు టైం ఉందని చెబుతున్నారు. మరి అఖండ 2 లో మోక్షజ్ఞ ఉండటం కన్ఫర్మా కాదా అన్నది త్వరలో తెలుస్తుంది.
అయితే బాలకృష్ణ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పించి నెక్స్ట్ ఇక సోలో సినిమాతో ఫ్యాన్స్ ని అలరించాలని చూస్తున్నారు. వారసుడి విషయంలో ఫ్యాన్స్ ఆసక్తిని గుర్తించిన బాలయ్య బాబు త్వరలో మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అఖండ 2లో మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తే సినిమాకు ఇదొక హైలెట్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు.నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో అది కూడా బాలయ్య వారసుడి అంటే ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. వాటికి తగినట్టుగానే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణ అనీల్ రావిపుడి కాంబోలో వస్తున్న సినిమా దసరాకి వస్తుండగా ఈ సినిమాను అభిమానుల అంచనాలను మించేలా అనీల్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: