మరో పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకున్న రష్మిక..!

Divya
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తను నటనతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా 38 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని.. ఈ రికార్డు సృష్టించిన అరుదైన హీరోయిన్ గా కూడా చలామణి అవుతుంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు గ్లామర్ షో తో రెచ్చిపోతున్న రష్మిక వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే గత ఏడాది పుష్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె ఈ ఏడాది వారసుడు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇప్పుడు తమిళంలో రెయిన్బో అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో కూడా నటిస్తోంది. అంతేకాదు పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 లో కూడా అవకాశం దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాలో అవకాశం తగ్గించుకున్నట్లు సమాచారం. అయితే ఈసారి తెలుగులో కాదు ఏకంగా బాలీవుడ్లో అవకాశం దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్లో.. మిషన్ మజ్ను, యానిమల్, గుడ్ బై వంటి చిత్రాలలో నటించి హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈమె ఇప్పుడు.. ఛవా అనే హిస్టారికల్ పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకుందని సమాచారం. ఇది తెలిసి రష్మిక మందన్న కి డిమాండ్ బాగా పెరిగిపోతోంది అంటూ అభిమానులు సైతం తెగ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఛవా సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తుండగా .. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం చత్రపతి శివాజీ పెద్ద కుమారుడైన చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మిక నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఛవా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా సెప్టెంబర్ నెలలో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: