కలకత్తా లో ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్....!!

murali krishna
చిరంజీవి, మెహర్‌ రమేష్‌ కాంబోలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'భోళా శంకర్‌'. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో హై-ఆక్టేన్‌ ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ను మేకర్స్‌ పూర్తి చేశారు. దీంతో 80% చిత్రీకరణ పూర్తయింది.
మే డే సందర్భంగా చిరంజీవి వింటేజ్‌ మాస్‌ లుక్‌లో కనిపించే మూడు కొత్త పోస్టర్‌లను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లలో మెగాస్టార్‌ గ్రే కలర్‌ యూనిఫాంలో టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తున్నారు. ఓ పోస్టర్‌లో టీ టైమ్‌ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఛార్మింగ్‌ స్మైల్‌తో యంగ్‌ అండ్‌ డైనమిక్‌గా కనిపిస్తూ మెగాస్టార్‌ అందర్నీ అలరిస్తున్నారు. ఇక ఆయన అభిమానుల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. టాక్సీ వెనుక బ్యాక్‌డ్రాప్‌ కలకత్తా నగరాన్ని సూచిస్తోంది. కలకత్తా కాళీ మాతా టెంపుల్‌ కూడా కనిపించడం విశేషం.
చిరంజీవి, కీర్తి సురేష్‌, తమన్నా, వెన్నెల కిషోర్‌, తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించుకోనున్న ఈ చిత్ర తదుపరి షెడ్యూల్‌ కోల్‌కత్తాలో ప్రారంభమ వుతుంది. ఆ తర్వాత చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను చిత్రీకరించేందుకు యూరప్‌ వెళ్లనున్నారు. దీని కోసమై మహతి స్వర సాగర్‌ రాకింగ్‌ నెంబర్‌ని స్కోర్‌ చేశారు. యూరప్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్‌, క్లైమాక్స్‌, భారీ సెట్‌ సాంగ్‌ చిత్రీకరిస్తాం. దాంతో జూన్‌ నెలాఖరుకు సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఇప్పటికే డబ్బింగ్‌ పనులు ఆరంభమయ్యాయి. క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో కలిసి అనిల్‌ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌ సమపాళ్లలో ఉండనున్నాయి.
తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సిస్టర్‌గా కీర్తి సురేష్‌, కనిపించనుంది. సుశాంత్‌ ఈ సినిమాలో లవర్‌ బారు పాత్రలో మెరవబోతున్నారు.ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.
రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్‌, వెన్నెల కిషోర్‌, తులసి, సురేక వాణి, శ్రీ ముఖి, హైపర్‌ ఆది, వైవా హర్ష, ప్రదీప్‌, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్‌ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్‌, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌, వీర్‌, షహ్వర్‌ అలీ, తరుణ్‌ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్‌, డీవోపీ: డడ్లీ, ఎడిటర్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, కథా పర్యవేక్షణ: సత్యానంద్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: