క్రిష్ -4 కూడ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

Divya
క్రిష్ చిత్రం మన ఇండియన్ సూపర్ హీరో చిత్రాలుగా తేరకెక్కించబడ్డాయి. అయితే ఈసారి నాలుగోవ సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం కోయి మిల్ గయా సినిమాతో మొదలైన ఈ చిత్రం క్రిష్ గా చేరిపోయింది. డైరెక్టర్ రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరోగా హృతిక్ రోషన్ నటించారు. ఈ సినిమా అప్పట్లో పెను సంచలనాలను సృష్టించింది. హాలీవుడ్ లో చూసిన ఈ తరహాలో కథను ఇండియన్ డైరెక్టర్ తీయడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.

కోయి మిల్ గయా కొనసాగింపు దాదాపుగా మూడేళ్ల తర్వాత క్రిష్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెను ప్రభంజనాన్ని సృష్టించింది. దాదాపుగా  రూ.40 కోట్లతో తెరకెక్కించగా రూ .120 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఏడేళ్ల తర్వాత మూడో పార్ట్ కూడా విడుదలయ్యింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది రూ .400 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక దీంతో క్రిష్-4 కొనసాగింపు ఎప్పుడు వస్తుందో అని హృతిక్ రోషన్ అభిమానులు సినీ ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా క్రిష్ ఫోర్ కు సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఈ సినిమాకి హృతిక్ తండ్రి రాకేష్ రోషన్.. కాకుండా కరణ్  మలహోత్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్తాన్ని సిద్ధార్థ ఆనంద్ తో కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫైటర్ వార్-2 చిత్రాలతో బిజీగా ఉన్న రుతిక్ రోషన్ వచ్చే ఏడాది క్రిష్-4 చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం మరి ఈ సినిమా పైన అధికారికంగా ప్రకటన వెలుపడాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: