కష్టడీ బయ్యర్లను కలవర పెడుతున్న ఏజెంట్ ఫలితం !

Seetha Sailaja
అఖిల్ ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘ఏజెంట్’ అతడి అభిమానులకు  మాత్రమే కాకుండా ఆ మూవీ బయ్యర్లకు కూడ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈమూవీ టాక్ ఎలా ఉన్నప్పటికీ వీకెండ్ లో కూడ ఈమూవీకి సరైన కలక్షన్స్ రాకపోవడంతో అక్కినేని యంగ్ హీరోలకు యూత్ లో క్రేజ్ లేదా అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి.

ఇప్పుడు ఇదే సమ్మర్ రేస్ లో తన తమ్ముడుని అనుసరిస్తూ నాగచైతన్య ‘కష్తడి’ మూవీతో రాబోతున్నాడు. ఈమూవీకి వెంకట్ ప్రభు దర్శకుడు. తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈమూవీ పై ఇప్పటివరకు చెప్పుకోతగ్గ స్థాయిలో క్రేజ్ ఏర్పడలేదు. దీనికితోడు ఇండస్ట్రీ వర్గాలలో అదేవిధంగా సినిమా ప్రేక్షకులలో ఐరన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి ఈమూవీలో చైతన్య పక్కన హీరోయిన్ గా నటిస్తూ ఉండటంతో చైతూ అభిమానులతో పాటు ఈ మూవీ బయ్యర్లలో కూడ కలవర పాటు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ఈమూవీ ప్రమోషన్ అఖిల్ ‘ఏజెంట్’ హడావిడి పూర్తి అయిన తరువాత చేద్దామని అనుకున్నట్లు తెలుస్తోంది. ‘ఏజెంట్’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఇప్పుడు కనీసం తన మూవీ అయినా ఎదో విధంగా హిట్ చేయాలని చైతన్య అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వెంకట్ ప్రభు ఇప్పటివరకు తెలుగులో డైరెక్ట్ సినిమా తీయలేదు.

తెలుగు ప్రేక్షకుల అభిరుచులతో అతడికి పరిచయాలు తక్కువ. గత ఏడాది తమిళంలో ‘మానాడు’ తో హిట్టు కొట్టినప్పటికీ అది చెప్పుకోతగ్గది కాదు. శ్రీలీల క్రేజ్ బాగా పెరిగాక కృతి శెట్టి పై యూత లో బాగా తగ్గింది. దీనికితోడు ఈసినిమాకు సంగీతం అందించిన ఇళయరాజా తెలుగులో మంచి ట్యూన్స్ ఇచ్చి చాల సంవత్సరాలు అయింది. ఇలా అనేక నెగిటివ్ పాయింట్స్ ఈమూవీ పై ఉండటంతో పాటు చైతన్య మొట్టమొదటిసారి చేస్తున్న సీరియస్ జానర్ మూవీ. దీనితో ఈమూవీ ఫలితం ఎలా ఉంటుంది అంటూ ఈమూవీ బయ్యర్లలో భయాలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: