హిట్టు ఇచ్చే కిక్ కన్నా ఫ్లాప్ ఇచ్చే కసే ఎక్కువ..!

shami
ప్రతి సినిమా హిట్ కొట్టాలన్న ఆలోచనతోనే ఎవరైనా సినిమా చేస్తారు. కానీ కొన్నిసార్లు సినిమా అనుకున్న విధంగా కుదరక ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తుంది. సినిమాపై భారీ హైప్ తెచ్చి అందులో విషయం ఏమి లేకపోతే ఆ సినిమా యూనిట్ కు.. ఆ సినిమా కాస్టింగ్ మీద వచ్చే ట్రోల్స్ అన్నీ ఇన్ని కావు. అయితే హిట్ ఇచ్చే కిక్ బాగుంటుంది కానీ ఫ్లాప్ ఇచ్చే కసి మరేది ఇవ్వదు. ముఖ్యంగా అక్కినేని నట వారసుడు అఖిల్ తన మొదటి సినిమా నుంచి ఫ్లాపులు ఫేస్ చేస్తూనే ఉన్నాడు. బ్యాచిలర్ సినిమా అతనికి కొంత రిలాక్స్ కలిగించిన మళ్లీ ఏజెంట్ డీలా పడేలా చేసింది.
ఏజెంట్ విషయంలో మిస్టేక్ ఎక్కడ జరిగింది అన్నది పక్కన పెడితే అఖిల్ ఈ సినిమా కోసం తన వరకు బాగానే హార్డ్ వర్క్ చేశాడు. అయితే సినిమా హిట్ అవ్వాలంటే వర్క్ అవుట్ అయ్యే మ్యాజిక్ ఈ సినిమాకు ఏ కోశాన హెల్ప్ అవలేదు. సైరా తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా అంటే ఆడియన్స్ ఈ సినిమాను భారీగా రిసీవ్ చేసుకుంటాడని అనుకున్నాడు కానీ సినిమాలో కంటెంట్ లేకపోతే స్టార్ డైరెక్టర్ స్టార్ హీరో ఎవరున్నా ఏమి చేయలేరన్న లాజిక్ అఖిల్ మిస్ అయ్యాడు. ఈ క్రమంలో ఏజెంట్ ఫెయిల్యూర్ ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటున్నాడు.
కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ కి ధైర్యం చెబుతున్నారు. ఫ్యాన్స్ అంతా అతన్ని ముద్దుగా అయ్యగారు అంటూ పిలుస్తారు. అయ్యగారే నెంబర్ 1 అన్న ఒక కామెంట్ కూడా పాపులర్ అయ్యింది. అఖిల్ నువ్వేమి ఫీల్ అవకు నెక్స్ట్ సినిమాకు మరింత కష్టపడు కథల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు మిగతాది మేం చూసుకుంటాం అని ఫ్యాన్స్ అంటున్నారు. అక్కినేని హీరోల్లో కాస్త కూస్తో మాస్ ఇమేజ్ తెచ్చుకునే హీరోలా అఖిల్ కనబడుతున్నాడు. ప్రస్తుతానికి సినిమా సినిమాకు టెస్టింగ్ టైం నడుస్తున్నా ఫ్యూచర్ స్టార్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: