"కేజిఎఫ్1" కంటే "2" కు 1వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు ఎక్కువ వచ్చాయో తెలుసా..?

Pulgam Srinivas
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో ఒకటి "కే జి ఎఫ్". ఈ మూవీ లో కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యాష్ హీరో గా నటించగా ... శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగం కన్నడ , తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో 21 డిసెంబర్ 2018 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే సాలిడ్ పాజిటివ్ టాక్ లభించింది.

దానితో "కే జి ఎఫ్ చాప్టర్ 1" మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన మొదటి రోజు 23 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ ఆ తర్వాత కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అలా భారీ అంచనాల నడుమ "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ 14 ఏప్రిల్ 2022 లో కన్నడ , తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండవ భాగానికి కూడా విడుదల అయిన మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ఏకంగా 164.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా "కే జి ఎఫ్ చాప్టర్ 1" మూవీ మొదటి రోజు కలెక్షన్ లతో పోలిస్తే "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ మొదటి రోజు అత్యంత ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: