"క్రిష్ 4" మూవీ పై లేటెస్ట్ అప్డేట్..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హృతిక్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే హృతిక్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో క్రిష్ సిరీస్ మూవీ లు ముందు వరసలో ఉంటాయి. క్రిష్ సిరీస్ మూవీ ల ద్వారా హృతిక్ అద్భుతమైన విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు క్రిష్ సిరీస్ మూవీ లలో మూడు భాగాలు రూపొందాయి. ఆ మూడు భాగాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. ఇది ఇలా ఉంటే తాజాగా క్రిష్ 4 మూవీ కి సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హృతిక్ హీరో గా రూపొందబోతున్న క్రిష్ 4 మూవీ షూటింగ్ 2024 వ సంవత్సరం చివరన ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా ఈ మూవీ కి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ మూడు భాగాలు అద్భుతమైన విజయం సాధించడం తో ఈ మూవీ యొక్క  4 వ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హృతిక్ వరుస మూవీ లతో ఫుల్ బిజీ గా కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: