అనిరుద్ చేతులో ప్రస్తుతం 8 క్రేజీ మూవీలు... అవి ఏవో తెలుసా..?

Pulgam Srinivas
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు మ్యూజిక్ ను అందించి ... ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్రను పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో 8 సినిమాలు ఉన్నాయి. ఆ 8 సినిమాలు ఏవో తెలుసుకుందాం.
అనిరుద్ రవిచంద్రన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న జైలర్ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు నెలలో ఈ మూవీ ని విడుదల చేయనున్నారు.
తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో మూవీకి కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని అక్టోబర్ 19వ తేదీన విడుదల చేయనున్నారు.
రజినీకాంత్ కెరియర్ లో 170 మూవీ గా రూపొంద పోతున్న సినిమాకు కూడా అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీకి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నాడు.
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
అజిత్ హీరోగా మగిజ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందబోయే విదా మయార్చి మూవీ కి కూడా అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు.
షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో పొందుతున్న జవాన్ మూవీకి కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతుంది.
విజయ్ దేవరకొండ ... గౌతమ్ తిన్ననురి కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కూడా అనిరుద్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నా యి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: