"మామా మ‌శ్చీంద్ర" మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల తేదీ ప్రకటన..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు శని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుదీర్ బాబు ఇప్పటికే ఎన్నో సినిమా లలో హీరో గా నటించాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ యువ హీరో హంట్ అనే మూవీ లో హీరో గా నటించాడు. సస్పెన్స్ ... థ్రిల్లర్ జోనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది.
 

కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలి పోయింది. ఇది ఇలా ఉంటే హంట్ లాంటి ఫెయిల్యూర్ మూవీ తర్వాత సుధీర్ బాబు ప్రస్తుతం "మామా మ‌శ్చీంద్ర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. దాని తో ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ మూవీ నుండి "గాలుల్లోన" అంటూ సాగే మొదటి లిరికల్ సాంగ్ ను మే 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సుధీర్ బాబు మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. దానితో ఈ మూవీపై  ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నా యి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: