ఏప్రిల్ 30వ తేదీన ఆ క్రేజీ 3 సినిమాల కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
నిన్న అనగా ఏప్రిల్ 30 వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్ ... పొన్నియన్ సెల్వన్ 2 ... విరూపాక్ష మూవీ లకు ఏ రేంజ్ షేర్ కలెక్షన్ లు దక్కాయో తెలుసుకుందాం.

అక్కినేని అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ నిన్నటి తో మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 43 లక్షల షేర్ కలెక్షన్ లను మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ నిన్నటి తో 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.40 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష కీలక పాత్రలలో నటించగా ... ఏఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష మూవీ నిన్నటి తో 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.38 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇది ఇలా ఉంటే నిన్న అనగా ఏప్రిల్ 30 వ తేదీన ఏజెంట్ ... పొన్నియన్ సెల్వన్ 2 ... విరూపాక్ష 3 సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.21 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sai

సంబంధిత వార్తలు: